
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు బీజేపీ ఎంపీలు తక్షణ సహాయం ప్రకటించారు. రాష్ట్రంలోని ఆరుగురు ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తమ ఎంపీ లాడ్స్ నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షల సాయం ప్రకటించారు. వీటిని వరద నష్ట నివారణ, సహాయక చర్యల కోసం వాడనున్నారు.